పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో పోప్ ఫ్రాన్సిస్ సమావేశం
పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ వాటికన్‌ను సందర్శించి, గాజాలో కాల్పుల విరమణ ఆవశ్యకతపై చర్చించారు.
వాటికన్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ సమాజంలో పాలస్తీనా రాష్ట్రానికి గుర్తింపును ప్రోత్సహించడాన్ని కొనసాగించాలని పోప్ ఫ్రాన్సిస్ ని కోరినట్లు తెలిపారు
30 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం "నేను పోప్‌ను కలిసిన ప్రతిసారీ పాత స్నేహితుడిని కలుసుకున్నట్లే" ఉంటుంది అని అధ్యక్షుడు అబ్బాస్ తన అభిప్రాయం వ్యక్తం చేసారు.
.
"గాజా లో తీవ్రమైన మానవతావాద పరిస్థితిని" సమావేశాలలో చర్చించారు, అలాగే "కాల్పుల విరమణ మరియు బందీలందరినీ వీలైనంత త్వరగా విడుదల చేయాలనే ఆశ" అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ నుండి వచ్చిన ఒక ప్రకటనలో పేర్కొని ఉంది.
అధ్యక్షుడు అబ్బాస్‌తో పోప్ ఫ్రాన్సిస్ సమావేశం ముగింపులో, ఒకరికొకరు కానుకలు ఇచ్చుకున్నారు.