పవిత్రాత్మ దేవుని నడిపింపుతో ఆదర్శవంతమైన కతోలిక సంఘాన్ని నిర్మించాలి - మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్

కర్నూలు మేత్రాసనంలో సినడ్ సమావేశాలు 26 మే 2025 న జీవసుధ పాస్ట్రల్ సెంటర్ నందు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో 121 మంది గురువులు, కన్యస్త్రీలు పాల్గొన్నారు.
26 మే 2025 న జరిగిన ప్రారంభ దివ్యబలిపూజకు కర్నూలు మేత్రాసన కాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసిసమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.
మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు మాట్లాడుతూ, ఆదిమ క్రైస్తవ సంఘాల ఆవిర్భావం గూర్చి, పునీత పేతురు గారు, మరియు పునీత పౌలు గారు ఏ విధంగా క్రైస్తవ సంఘాలను నడిపించారు అన్న విషయాలను అపొస్తలుల కార్యముల నుండి చక్కని ఉదాహారణలతో వివరించారు.
ఈ సమావేశాలలో పవిత్రాత్మ దేవుని నడిపింపుతో, పరస్పర జ్ఞాన సముపార్జనతో ఆదర్శవంతమైన కతోలిక సంఘ నిర్మాణానికి అందరు కృషి చేయాలని మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు ఆకాంక్షించారు.
ఈ సమావేశాలు 4 రోజుల పాటు జరగనున్నాయి.