పదకొండు దేశాల దౌత్యవేత్తలను స్వాగతించిన పోప్ ఫ్రాన్సిస్

డిసెంబర్ 7 హోలీ సీకి పదకొండు మంది నూతన రాయబారులను ఉద్దేశించి, పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు 

శాంతి మరియు సహకారాన్ని పెంపొందించడం కొనసాగించమని వారిని ప్రోత్సహిస్తూ, యుద్ధంతో అలసిపోయిన మన ప్రపంచంలో ఆశాకిరణాలను విత్తడంలో వారి ప్రయత్నాల ఆవశ్యకతను  వివరించారు.

హోలీ సీకి పదకొండు మంది కొత్త రాయబారులు సమర్పించిన ఆధారాల లేఖలను పోప్ ఫ్రాన్సిస్ ఆమోదించారు

భారతదేశం, జోర్డాన్, డెన్మార్క్, లక్సెంబర్గ్, సావో టోమ్ మరియు ప్రిన్సిపే, రువాండా, తుర్క్‌మెనిస్తాన్, అల్జీరియా, బంగ్లాదేశ్, జింబాబ్వే మరియు కెన్యా వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

వాతావరణ మార్పుల వినాశకరమైన ప్రభావం, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సమాజంలోని నిరుపేద సభ్యులు, సాయుధ పోరాటాలు, వలసదారులు, శరణార్ధుల పరిస్థితి వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నందున అంతర్జాతీయ దౌత్యంలో వారి మిషన్ ప్రత్యేకంగా క్లిష్టమైన సమయంలో ప్రారంభమవుతుందని పోప్  ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు.

ఈ సమస్యలకు "సులభమైన పరిష్కారం లేదు, లేదా వాటిని ఒక దేశం లేదా చిన్న రాష్ట్రాల సమూహం యొక్క చర్యల ద్వారా పరిష్కరించలేము" అని అంటూ, అన్ని దేశాల సమిష్టి కృషి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది  అని ఆయన అన్నారు.

చర్చలు, సయోధ్య, పరస్పర అవగాహన, ప్రతి వ్యక్తి గౌరవం,హక్కుల పట్ల గౌరవం మరియు "సానుకూల తటస్థత," సాధన ద్వారా విభేదాల పరిష్కారానికి దోహదపడే దౌత్య ప్రయత్నాలను పెంపొందించవచ్చు అని పోప్ ఫ్రాన్సిస్ నూతన రాయబారులకు గుర్తు చేశారు.