న్యాయం, సత్యంతో శాంతిని పెంపొందించమన్న పోప్

మే 16 2025 శుక్రవారం ఉదయం హోలీ సీ దౌత్య దళాల సభ్యులతో 14వ సింహరాయలు పోప్ సమావేశమైయ్యారు
పోప్ ఫ్రాన్సిస్ మరియు మునుపటి పోప్‌లకు ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో సేవను అందించినందుకు దౌత్య దళాల డీన్ సిప్రస్ Ambassador George Poulides కు కృతజ్ఞతలు తెలిపారు.
దౌత్య సంఘాలు మానవాళిని కాపాడడమే కాకుండా శ్రీసభ ఆనందాలను మరియు దుఃఖాలను పంచుకునే" కుటుంబంగా పోప్ వర్ణించారు.
పోప్ ఫ్రాన్సిస్ పేదలు మరియు అణగారిన వర్గాల పట్ల నిబద్ధత, అలాగే సృష్టి రక్షణ మరియు కృత్రిమ మేధస్సు పెరుగుదలపై ఆయన శ్రద్ధ, స్థిరమైన మరియు నిరంతర ప్రేరణగా ఉన్నారని పోప్ అన్నారు
ఉత్తర,దక్షిణ అమెరికా మరియు యూరప్ అంతటా తన స్వీయ ప్రయాణం గుర్తుచేస్తూ , పోప్ "సరిహద్దులను దాటి మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరియు దేశాలతో శ్రీసభ సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలనే తన వ్యక్తిగత కోరికను వ్యక్తం చేశారు.