'నెక్ట్స్‌జెన్ డిజిటల్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఉడిపి మేత్రాసనం.

ఉడిపి మేత్రాసనం ఇండియన్ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ వారు ఫిబ్రవరి 16న అనుగ్రహ పాస్టోరల్ సెంటర్‌లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ల 'నెక్ట్స్‌జెన్ డిజిటల్' అనే శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమం మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ స్టీవెన్ ఫెర్నాండెజ్ ప్రారంభ ప్రార్థనతో మొదలవగా,దాదాపు 40 మంది పాల్గొన్నారు.
మంగళూరులోని కెనరా కమ్యూనికేషన్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ అనిల్ ఫెర్నాండెజ్ ఈ శిక్షణకు నాయకత్వం వహించారు, ఇది పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ల పాత్రలు,ప్రసార మాధ్యమాలు సంక్షోభ నిర్వహణ, వార్తల రచన కొరకు కృత్రిమ మేధస్సు సాధనాల వాడకం గురించి శిక్షణ ఇచ్చారు.
ప్రభావవంతమైన డిజిటల్ మీడియా నిర్వహణ కోసం లియోనార్డో, ఫ్రీపిక్, కాన్వా మరియు కాథలిక్ కనెక్ట్ యాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఆయన పరిచయం చేశారు.
మీడియా కమ్యూనికేషన్, AI సాధనాలు మరియు సంక్షోభ నిర్వహణలో ఆచరణాత్మక నైపుణ్యాలతో సన్నద్ధం చేసింది,
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచే మార్గాలను ఈ శిక్షణ తెలియచేసింది