నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం మహోత్సవములు
నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం మహోత్సవములు
ఏలూరు మేత్రాసనము, నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం మహోత్సవములు మార్చి 22, 23, 24, 25 శుక్ర, శని, ఆది, సోమవారములు జరగనునవి.
ఈ కార్యక్రమాలు ఏలూరు పీఠాధిపతి మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య పొలిమేర జయరావు, D.D. గారి ఆధ్వర్యంలో జరగనున్నవి.
మార్చి 16 న నవదిన ప్రార్థనలు మొదలైనవి. మార్చి 16 శనివారం నాడు మహా పూజ్య పొలిమేర జయరావు గారి చేతులమీదుగా నిర్మలగిరి మేరీమాత పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం పీఠాధిపతుల మరియు ఇతర గురువులచే సమిష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. మార్చి 24 వరకు జరగనున్న ఈ నవదిన ప్రార్థనలలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు జపమాల, ధ్యానం సాయంత్రం గం|| 6:30 ని॥ లకు దివ్యబలిపూజ జరగనున్నది.
ఆదివారం నాడు నిర్మలగిరి వికారియేట్ గురువులు గురుశ్రీ ఎస్.జాన్ పీటర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, దివ్యబలిపూజ నిర్వహించారు.
పండుగ రోజు మార్చి 25 సోమవారం ఉదయం 6.30 గంటలకు గురుశ్రీ యస్. జాన్ పీటర్, పుణ్యక్షేత్ర డైరక్టర్ గారిచే దివ్య బలిపూజ నిర్వహించబడును. సాయంత్రం 6.00 గంటలకు ఏలూరు పీఠాధిపతి మహా పూజ్య పొలిమేర జయరావు, D.D. గారికి స్వాగతాంజలి అనంతరం మేత్రాసన గురువులతో కలసి దివ్య బలిపూజ నిర్వహించబడును.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు , విజయవాడ వారి చే "ధనవంతుడు - లాజరు" నాటిక ప్రదర్శించబడును.
గురుశ్రీ ఎస్.జాన్ పీటర్ గారు ప్రజలందరినీ పండుగకు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer