దేవునిపై ఆధారపడి జీవిద్దామన్న XIV లియో పోప్

మే 25 2025 న అపోస్టోలిక్ ప్యాలెస్ నుండి XIV లియో పోప్ తన మొదటి రెజీనా కాయెలి సందేశాన్ని అందించారు
మన విశ్వాస ప్రయాణంలో కొన్ని సందర్భాలలో పరిస్థితులకు భయపడి మన హృదయాలను కలవరపాటుకు గురిచేస్తూ, మనల్ని మనం అసమర్థులుగా భావించుకుంటాము.
ఇలాంటి సందర్భాలలో మన ప్రతి అడుగులో ఆ దేవుడు మనకు తోడుగా ఉంటారని విశ్వసించాలని పోప్ వ్యాఖ్యానించారు.
ఈనాటి సువిశేషంలో మనం మన సొంత బలం మీద కాకుండా దేవుని దయ పై ఆధారపడాలని తెలియపరుస్తున్నదని ఆయన అన్నారు.
దేవుడు ఒసగిన పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎల్లవేళలా మనతో ఉంటారని, మనకు ప్రతి విషయాన్ని బోధిస్తారని దీనిని ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకొని మన బాధలు, ఆందోళనలను ప్రభువు మనకు శాంతి మరియు ఓదార్పు ను అనుగ్రహిస్తాడని విశ్వసించాలని పోప్ లియో XIV విశ్వ శ్రీసభకు తెలియపరిచారు.