ప్రభు యేసుని ప్రేమను చాటిన కైలాసపురం యువత

ప్రభు యేసుని ప్రేమను చాటిన కైలాసపురం యువత
"జూబ్లీ 2025" సంవత్సరం సందర్భంగా విశాఖ అతిమేత్రాసనం, కైలాసపురం విచారణ వేళంగాణిమాత దేవాలయ విచారణ కర్తలు, ఆధ్యాత్మిక గురువులు ఫాదర్ సంతోష్ CMF, గారి ఆధ్వర్యంలో యువత ప్రభు యేసుని ప్రేమని చాటారు. ఈ కార్యక్రంలో వైజాగ్ భారత చెరసాల పరిచర్య(PMI) సీనియర్ సభ్యురాలు సిస్టర్ మేరీ జేమ్స్ గారు పాల్గొన్నారు.
ఆగస్టు 17 (ఆదివారం)న విశాఖపట్నంలోని జువెనైల్ హోమ్ మరియు బాలుర ప్రభుత్వ పరిశీలన గృహాన్ని వీరు సందర్శించారు. అక్కడ ఉన్నవారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఫాదర్ సంతోష్ CMF, గారు ఖైదీలకు విలువల ఆధారంగా ఒక చిన్న సందేశాన్ని ఇచ్చారు. అనంతరం వారి కొరకు ప్రార్ధించారు.
విచారణ యువత మరియు పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అక్కడ ఉన్నవారిని సంతోషపెట్టారు. అనంతరం వారికి స్వీట్లు మరియు కొన్ని స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు.
Article and Design: M. Kranthi Swaroop