టెక్సాస్ వరద బాధితుల కొరకు ప్రార్దించిన పోప్ లియో

ఆదివారం జులై 6 న త్రికాల ప్రార్ధన ముగింపులో యునైటెడ్ స్టేట్స్‌,టెక్సాస్‌లోని గ్వాడాలుపే నది వరదల వల్ల సంభవించిన విపత్తులో ప్రాణాలు కోల్పొయిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని పోప్ లియో వ్యక్తం చేశారు. 

శుక్రవారం ఉదయం తెల్లవారుజామున కేవలం 45 నిమిషాల్లోనే నీరు దాదాపు ఎనిమిది మీటర్లు (26 అడుగులు) పెరిగి, దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని తుడిచిపెట్టేసింది. 

అత్యంత ప్రభావితమైన ప్రాంతమైన Kerr County విషాదంలో కనీసం 51 మంది మరణించినట్లు తెలిసింది మరియు ఎంతో మంది తప్పిపోయారు, వీరిలో క్రైస్తవ వేసవి శిబిరంలో పాల్గొంటున్న 27 మంది బాలికలు కూడా ఉన్నారు.

బాధితులకు సహాయం చేస్తున్న అనేక మంది వ్యక్తులు మరియు సంస్థలను గమనిస్తూ, ఆర్చ్ డియోసెసన్ ప్రకటన ఇలా పేర్కొంది, "వరదలతో ప్రభావితమైన వారు పునర్నిర్మించడానికి బలం పొందాలని మా ప్రార్థన," అని జోడించి, "ఈ సవాలుతో కూడిన పరిస్థితుల్లో ప్రజలతో ఉంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఒకరినొకరు ప్రేమించుకోవాలనే క్రీస్తు పిలుపుకు మనం సమాధానం ఇద్దాం."