జాతీయ శాంతి నిరసన దినము - కర్నూలు మేత్రాసనం
కర్నూలు మేత్రాసనం, కలెక్టర్ ప్రాంగణంలోని ,మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ఆగస్టు 10 ,2024 న దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి అని శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
భారత రాజ్యాంగము అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించినది. సిక్కు, జైన, బౌద్ధ మతములు తీసుకున్న దళితులకు షెడ్యూల్ కులాల హోదా కల్పించారు.
ఎస్ సి,బీసీ కమిషన్ మేత్రాసన సెక్రెట్రరీ గురుశ్రీ ఎస్ భాస్కర్ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటాలు ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన నిరసన వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని అనుసరించి మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఎవరు ఇష్టపడిన మతాలను వారు అనుసరించే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
సంగీపాగి అంతోని గారు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల క్రైస్తవులకు ఎస్సీ హెూదా కల్పించాలని గత 73 సంవత్సరాలుగా దళిత సంఘాలు, లౌకికవాద పార్టీలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారని ఆయన తెలిపారు. 1950 నుంచి ఇప్పటివరకు ఎస్సీ హెూదా కల్పించే విషయాన్ని పరిశీలించుటకై అనేక కమిటీలు, కమిషన్లు నియమించబడిన ఫలితం లేకుండా పోయిందని నిరసన వ్యక్తం చేశారు.
దళిత క్రైస్తవుల్లారా మనకు న్యాయంగా రాజ్యాంగపరంగా రావలసిన హక్కులను 73 ఏళ్లుగా.. కోల్పోయామని ఈ హక్కుల సాధనకు ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గురుశ్రీ కె. అంతోని రాజ్, గురుశ్రీ పసల లహస్త్రాయ, జే ప్రభుదాస్, డేనియల్, క్రైస్తవ వేదిక నాయకులు శ్రీ ప్రభుదాసు గారు కతోలిక సంఘం నాయకులు సంగి పాగి అంతోని గారు, గల్లెల బాలరాజు గారు, పులి గుజ్జు మేరీ జోత్స్నా గారు, డిసౌజ గారు, వెంకటేశ్వర్లు గారు మరియు ఇతర క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.