ఘనంగా జరిగిన గురుశ్రీ ముప్పాళ జేవియర్ గారి గురుత్వ రజత జూబిలీ వేడుకలు
ఘనంగా జరిగిన గురుశ్రీ ముప్పాళ జేవియర్ గారి గురుత్వ రజత జూబిలీ వేడుకలు
16 నవంబర్ 2024 న నల్గొండ మేత్రాసనం, పొనుగోడు విచారణలో గురుశ్రీ ముప్పాళ జేవియర్ గారి గురుత్వ రజత జూబిలీ వేడుక ఘనంగా జరిగింది.
ఉదయం 9 : 00 గంటలకు కృతజ్ఞతా దివ్యబలి పూజను నల్గొండ పీఠకాపరి మహా పూజ్య కరణం థమన్ గారు, ఖమ్మం పీఠకాపరి మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు విజయవాడ పీఠకాపరి మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు, శ్రీకాకుళం పీఠకాపరి మహా పూజ్య రాయరాల విజయ్ కుమార్ గారు, నెల్లూరు మేత్రాసన నూతన సహపీఠకాపరి మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు, నల్గొండ మేత్రాసన విశ్రాంత పీఠాధిపతి మహా పూజ్య గోవిందు జోజి గారు మరియు మిషన్ అఫ్ కంపాషన్ సభ సుపీరియర్ గురుశ్రీ బొబెన్ కొల్లపల్లిల్ గారు అర్పించారు.
అనేక మంది గురువులు ఈ దివ్యబలిపూజలో పాల్గొని గురుశ్రీ ముప్పాళ జేవియర్ గారి కోసం ప్రార్ధించారు.
ప్రారంభ పలుకుగా మహా పూజ్య జోసఫ్ రాజారావు గారు మాట్లాడుతూ ప్రతి గురువు తన జీవితాన్ని ఒక అర్పణగా దైవసేవ నిమిత్తము సమర్పించుకుంటాడని అది ప్రేమపూర్వక సమర్పణ అని, వారి రజత జూబిలీ సందర్భముగా వారికొరకు ప్రత్యేకముగా ప్రార్ధించుదాం అని అన్నారు.
ఈ సందర్భముగా గురుశ్రీ ముప్పాళ జేవియర్ గారి మధ్యవర్తిత్వంతో జర్మనీ దేశ యాక్షన్ క్లైనర్ ప్రిన్స్ సంస్థ వారి ఆర్ధిక సహాయంతో నిర్మించబడిన సెయింట్ జేవియర్ బాలికల వసతి గృహ ప్రారంభోత్సవం కూడా జరిగింది .
మహా పూజ్య కరణం థమన్ కుమార్ గారు నూతన వసతి గృహాన్ని ఆశీర్వదించగా యాక్షన్ క్లైనర్ ప్రిన్స్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ డీటర్ గ్రోత్యుస్ గారు రిబ్బన్ కత్తిరించి వసతి గృహాన్ని ప్రారంభించారు.
పూజానంతరం అదే రోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్న నాల్గోన పీఠకాపరి మహా పూజ్య కరణం థమన్ గారిని సత్కరించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
పీఠాధిపతులు, విచ్చేసిన గురువులు, కన్యస్త్రీలు, గురుశ్రీ ముప్పాళ జేవియర్ గారికి జూబిలీ శుభాకాంక్షలు తెలిపారు.
గురుశ్రీ ముప్పాళ జేవియర్ గారి కుటుంబ సభ్యులు కూడా ఆయనను ససత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Article and Design By
Bandi Arvind