ఘనంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవ సంస్థ సర్వసభ్య సమావేశం

ఘనంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవ సంస్థ సర్వసభ్య సమావేశం
జులై 11,2025 , శుక్రవారం నాడు సిఖ్ విలేజ్ లో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవ సంస్థ(APSSS) సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఏలూరు పీఠాధిపతులు, APSSS అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు గారి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో APSSS మాజీ ఉపాధ్యక్షులు మహా పూజ్య అంథోని ప్రిన్స్ గారు మరియు APSSS నూతన ఉపాధ్యక్షులు మహా పూజ్య కరణం దమన్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవ సంస్థను అభివృద్ధిలో నడిపించటానికి కార్యవర్గ సభ్యులు వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి ఫాదర్ లు, సాంఘిక సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మహా పూజ్య పొలిమేర జయరావు గారు నూతన ఉపాధ్యక్షులు మహా పూజ్య కరణం దమన కుమార్ గారిని ఆహ్వానిస్తూ సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవ సంస్థ డైరెక్టర్ ఫాదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ "పేద మహిళలు, మధ్య తరగతి మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవడమే APSSS లక్ష్యం" అని అన్నారు.
గురుశ్రీ ప్రసాద్ గారు సర్వసభ్య సమావేశంలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలను ఇచ్చిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.
సాంఘిక సేవా విభాగం లో మన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సేవ సంస్థ (APSSS) అనేకమైన విజయాలు సాధించాలని "అమృతవాణి - రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు" విభాగం నుండి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer