గ్యాస్ స్టేషన్ పేలుడులో గాయపడిన వారికొరకు ప్రార్ధించిన పోప్

జూలై 4, శుక్రవారం ఉదయం 8:15 గంటల తర్వాత తూర్పు రోమ్‌లోని ఒక గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడులో గాయపడిన వారికొరకు ఇటాలియన్ భాషలో పోప్ లియో తన X ఖాతాలో ప్రార్థన చేశారు
ఈ పేలుడులో తొమ్మిది మంది పోలీసు అధికారులు, ఒక అగ్నిమాపక సిబ్బందితో సహా 20 మందికి పైగా గాయపడ్డారు.
నగరం అంతటా వివిధ ప్రాంతాలలో పేలుడు శబ్దం వినిపించింది మరియు ఆకాశంలో పెద్ద పొగ మేఘం కనిపించింది
పోప్ సోషల్ మీడియా ద్వారా తన మేత్రాసనం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు
రోమ్ అగ్నిమాపక శాఖ ప్రాథమిక నివేదికల ప్రకారం, స్టేషన్‌లో ఇంధనం నింపుతున్న ఇంధన ట్యాంకర్ నుండి పైప్‌లైన్ విడిపోవడం వల్ల పేలుడు సంభవించిందని ఆరోపించారు.
అయితే, అత్యవసర సేవలు ఇప్పటికీ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిస్థితిని అంచనా వేయడానికి మేయర్, రాబర్టో గ్వాల్టియరీ, ఆ ప్రాంతానికి వెళ్లారు.