'గాజాలో బాంబు దాడులకు' ముగింపు పలకాలని పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్

ద్వైపాక్షిక న్యుమోనియాకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన తర్వాత వాటికన్‌కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో, పోప్ ఫ్రాన్సిస్ శాంతి కోసం తన పిలుపును పునరుద్ఘాటించారు.
గాజా మరియు ఇతర సంఘర్షణ ప్రాంతాలలో హింసను నిలిపివేయాలని మరియు దక్షిణ కాకసస్‌లో సంభాషణల ప్రయత్నాలకు తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
తను సిద్ధం చేసిన సందేశంలో, పోప్ ఆ రోజు సువార్తను ధ్యానాంశాన్ని వివరించి,గాజాలోని ప్రజల అపారమైన బాధలను, అలాగే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిణామాలను ఎదుర్కొంటున్న వారందరినీ గుర్తుచేశారు.
"ఆయుధాల ఉపయోగాని వెంటనే నిలిపివేయాలని మరియు సంభాషణను తిరిగి ప్రారంభించడానికి పిలుపునిస్తున్నాను, తద్వారా బందీలను విడుదల చేయవచ్చు మరియు కాల్పుల విరమణ సాధించవచ్చు." అని పొప్ అన్నారు
ముగించే ముందు, పవిత్ర తండ్రి మరోసారి వర్జిన్ మేరీ
"ముఖ్యంగా హింసించబడిన ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, లెబనాన్, మయన్మార్, సూడాన్ మరియు కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్‌లో" శాంతి కొరకు కలసి ప్రార్థించడానికి విశ్వాసులను ఆహ్వానించారు.
మరియతల్లి మధ్యవర్తిత్వంపై తన నమ్మకాన్ని ఉంచి, శ్రీసభను, ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించమని ఆ తల్లిని వెడుతూ ముగించారు.