ఒడిశా గోరక్షకుల దాడి కేసులో వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ అరెస్టులు జరగలేదు

ఒడిశా గోరక్షకుల దాడి కేసులో వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ అరెస్టులు జరగలేదు

ఒడిశా రాష్ట్రంలోని క్రిస్టియన్ నాయకులు నిరసన వ్యక్తం చేసారు. వారం రోజుల క్రితం ఇద్దరు వృద్ధ కతోలిక గిరిజన సోదరులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న  
"గో సంరక్షకుల"ను అరెస్టు చేయకపోవడంపై పోలీసులను విమర్శించారు.

సుందర్‌గఢ్ జిల్లాలోని తెలెనాదిహి గ్రామంలో గో సంరక్షకులుగా అనుమానిస్తున్న దాదాపు 15 మందితో కూడిన గుంపు ఆగస్టు 19న ఫిలిప్ సోరెన్ (66) మరియు అతని తమ్ముడు జోహన్ సోరెన్ (55)పై దాడి చేసింది.

ఈ ఇద్దరు సోదరులు తమ ఎద్దులను అమ్మడానికి  తరలిస్తున్నప్పుడు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని వారు ఆరోపించి దాడి చేసారు. ఫిలిప్ తొడలో లోతైన గాయమైనది   మరియు అతని పక్కటెముకలు విరిగిపోయాయి, అయితే ఆ గుంపు చెక్క కర్రలతో వారిపై దాడి చేయడంతో జోహన్ చేయి కూడా విరిగింది.  

ఫిలిప్ సోరెన్ ఆగస్టు 27న UCA న్యూస్‌తో మాట్లాడుతూ, మా ఇద్దరిని  రోడ్డుపై ఆపి, ఎద్దులను ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగినప్పుడు దాడి ప్రారంభమైందని చెప్పారు. "ఎద్దులు ఇప్పటికే అమ్ముడయ్యాయని, కొనుగోలుదారునికి అందించడానికి మేము వాటిని తీసుకెళ్తున్నామని మేము వారికి చెప్పాము" అని ఆయన అన్నారు.

గ్రామంలో పనిచేసే డివైన్ వర్డ్ ఫాదర్ అశోక్ మింజ్ గారు మాట్లాడుతూ " పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపణలతో ఈ దాడి చేశారన్నారు. 

ఫిర్యాదును పోలీసులు మొదట నిరాకరించారు కానీ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆగస్టు 23న ఫిర్యాదును అంగీకరించారు అని తెలిపారు. అయితే, "ఈ రోజు వరకు అరెస్టు జరగలేదు" అని ఫాదర్ అశోక్ మింజ్ గారు  ఆగస్టు 27న UCA న్యూస్‌తో అన్నారు.

దాడి జరిగింది రోజు స్థానిక పోలీసులు తమ ఫిర్యాదును నమోదు చేయడానికి నిరాకరించడంపై బాధితులు ఆగస్టు 22న జిల్లా పోలీసు చీఫ్ కార్యాలయానికి వెళ్లి  ఫిర్యాదు చేశారు. వారు దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా సమర్పించారు.

“దాడి చేసినవారిని  గుర్తించినప్పటికీ, వారు స్థానికంగా గో సంరక్షకులుగా తెలిసినప్పటికీ, పోలీసులు ఇంకా వారిని అరెస్టు చేయలేదు, ఇది ఆశ్చర్యకరం” అని ఫాదర్ అశోక్ మింజ్ గారు అన్నారు.

దేశంలో క్రైస్తవ మైనార్టీలకు రక్షణ కరువైంది. యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫోరం (UCF) విడుదల చేసిన సమాచారం ప్రకారం..2024లో క్రైస్తవులపై 834 , 2023లో 733 దాడులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి అని తెలిపింది . ఈ  దాడులపై  యుసిఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

Article and Design: M. Kranthi Swaroop