26 మంది గురువిద్యార్థులు డీకన్లుగా అభిషేకించబడ్డారు
26 మంది గురువిద్యార్థులు డీకన్లుగా అభిషేకించబడ్డారు
పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం, రామంతాపూర్లో 26 మంది గురువిద్యార్థులు డీకన్లుగా అక్టోబర్ 28,2025న అభిషేకించబడ్డారు.
విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య జొసఫ్ రాజారావు గారు 26 మంది వివిధ మేత్రాసన గురువిద్యార్దులను డీకన్లుగా అభిషేకించారు. వీరిలో 24 మంది పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయానికి, ఇద్దరు బెంగుళూరులోని పునీత పేతురు గురు విద్యాలయానికి చెందినవారు.
ఈ కార్యక్రమంలో సెమినరీ రెక్టార్ ఫాదర్ కొమ్మారెడ్డి మరెడ్డి గారు ,ఇతర గురువులు, మఠకన్యలు, గురువిద్యార్థులు మరియు సెమినరీ ఉపాధ్యాయులు వారితో పాటు వేడుకలో పాల్గొన్నారు.
Article and Design by M Kranthi Swaroop