ఉక్రెయిన్ ప్రజలు నిరీక్షణా జ్వాలను సజీవంగా ఉంచమని పిలుపునిచ్చిన పోప్

సెప్టెంబర్ 6న Lvivలో జరిగే Halić మెట్రోపాలిటన్ సీ ఏర్పాటైన 650వ వార్షికోత్సవ వేడుకల్లో తనకు ప్రాతినిధ్యం వహించే కార్డినల్ Crescenzio Sepeకు లేఖ రాసారు.

లాటిన్‌లో వ్రాసిన సందేశం లో యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు తన హృదయపూర్వక సంఘీభావాన్ని పోప్ లియో వ్యక్తం చేశారు.

చివరికి లాటిన్ల లివివ్ అగ్రపీఠంగా మారిన చారిత్రాత్మక మెట్రోపాలిటన్ సీ ఆఫ్ హాలిక్, కాథలిక్ చర్చి యొక్క లాటిన్ ఆచారంలో భాగం.

"కుటుంబంలో మరియు ప్రజా జీవితంలో మరింత ఎక్కువ శ్రద్ధతో దాతృత్వ ఆజ్ఞను" కాపాడుకోవాలని,

"రోజువారీ జీవితంలో సజీవ క్రైస్తవ ఆశను పెంపొందించుకోవాలని" అదే సమయంలో ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని ప్రార్దిదాం అని పోప్ లియో అన్నారు  

ఈ వేడుక లివివ్‌లోని Assumption of the Blessed Virgin మేరీ కథడ్రల్ లో జరుగనుంది అని హోలీ సి ప్రెస్ ఆఫీస్ పేర్కొంది .