ఇటాలియన్ ప్రధాన మంత్రితో సమావేశమైన పోప్

బుధవారం జులై 2 ఉదయం అపోస్టోలిక్ ప్యాలెస్‌లో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో పోప్ లియో సమావేశమైయ్యారు 

జూన్ 24–25 తేదీలలో NATO  శిఖరాగ్ర సమావేశం నుండి రోమ్‌కు తిరిగి వచ్చిన ప్రధాన మంత్రితో పోప్ ఇదే మొదటి అధికారిక సమావేశం

పోప్‌తో సమావేశమైన తర్వాత, అధ్యక్షుడు Meloni సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు రాష్ట్రాలతో సంబంధాల అండర్-సెక్రటరీ మొన్సిగ్నోర్ మిరోస్లా ను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది 

"సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చల సందర్భంగా, ద్వైపాక్షిక సంబంధాలకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి".

ఉక్రెయిన్ మరియు మధ్యప్రాచ్యంలో శాంతికి మరియు గాజాలో మానవతా సహాయానికి ఉమ్మడి నిబద్ధత ఉద్ఘాటించబడ్డాయి” అని ప్రకటన పేర్కొంది.

ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అనేక ప్రశ్నలపై, అలాగే శ్రీసభ మరియు ఇటాలియన్ సమాజానికి సంబందించిన వివిధ అంశాలపై చర్చలు కొనసాగాయి