ఇక సెలవు ...!

ఇక సెలవు ...!

పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అంత్యక్రియలు ఈరోజు జరగనున్నాయి. సికింద్రాబాద్, అమృతవాణి సమీపంలో గల  "సెంటినరీ బాప్టిస్ట్ దేవాలయం" లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పార్థివదేహాన్ని ఉంచారు.  ప్రజల సందర్శనార్థం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పార్థివదేహాన్ని సాయంత్రం 4 గంటల వరకు దేవాలయంలోనే ఉంచనున్నారు.  అనంతరం అంత్యక్రియలు జరగనున్నాయి.  

TCBC  డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్ గారు, TCBC - క్రైస్తవ సమైక్య విభాగ ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ కే అంతయ్య గారు, గురుశ్రీ ప్రభుదాస్ గారు, పలువురు గురువులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి  పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు.పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి  పార్థివ దేహ సందర్శనార్థం భారీగా అభిమానులు, క్రైస్తవ సంఘాలు తరలివస్తున్నాయి.
 
 

Design and Article By
M Kranthi Swaroop
RVA Telugu Online producer