ఆసుపత్రిలో చేరిన తర్వాత మొదటి ఆశీర్వాదం ఇచ్చిన పోప్ ఫ్రాన్సిస్

మార్చి 23,2025 న రోమ్‌లోని జెమెల్లి ఆసుపత్రి ముందు గుమిగూడిన దాదాపు మూడు వేల మంది విశ్వాసులను పోప్ ఫ్రాన్సిస్ పలకరిస్తూ, “అందరికీ ధన్యవాదాలు!” తెలిపారు 

"ఫ్రాన్సిస్కో, ఫ్రాన్సిస్కో!", "మేము నిన్ను ప్రేమిస్తున్నాము!", "మీ కోసం మేము ఉన్నాము!" అని అరుస్తున్న జనసమూహాన్ని ఆశీర్వదించడానికి తన చేయి ఊపుతూ పొప్ నవ్వారు, తరువాత బలహీనమైన స్వరంతో "అందరికి  ధన్యవాదాలు!" అని అన్నారు. 

క్లుప్తంగా పలకరించిన తర్వాత బాల్కనీ నుండి బయటకు వచ్చిన వెంటనే, జనసమూహం ఆసుపత్రి ప్రవేశ ద్వారం వైపుకు తరలివచారు.

ఆ తర్వాత పొప్ సెయింట్ మేరీ మేజర్ బసిలికాకు వెళ్లారు, అక్కడ పాపల్ బసిలికా కోఅడ్జుటర్ ఆర్చ్‌ప్రిస్ట్ కార్డినల్ రోలాండాస్ మాక్రికాస్‌ను కలిశారు, తనను అనారోగ్యము నుండి  సంరక్షించినందుకు కృతజ్ఞతగా తెలియచేయడానికి  మేరీ సాలస్ పాపులి రోమానీ చిహ్నం ముందు ఉంచడానికి పువ్వులు ఇచ్చారు.

ఆసుపత్రి బాల్కనీలో కనిపించే ముందు, పోప్ ఫ్రాన్సిస్ జెమెల్లి ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి   కృతజ్ఞతలు తెలిపారు.