అజ్మీర్ మేత్రాసనానికి నూతన పీఠాధిపతిని నియమించిన పొప్ ఫ్రాన్సిస్

ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 1, 2025న అజ్మీర్ మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా గురుశ్రీ జాన్ కార్వాల్హో (John Carvalho)ని నియమించారు  

ప్రస్తుతం అజ్మీర్ లోని అల్వార్ గేట్ లోని సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తునారు.

జూన్ 1, 2024న మహా పూజ్య పాయస్ థామస్ డిసౌజా రాజీనామా చేయడంతో అజ్మీర్ మేత్రాసనం ఖాళీ అయింది.

జైపూర్ విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య ఓస్వాల్డ్ జోసెఫ్ లూయిస్ మార్చి 23, 2024న అజ్మీర్ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులయ్యారు.

గురుశ్రీ జాన్ ఏప్రిల్ 10, 1969న ఉడిపి మేత్రాసనం, మార్గోలిలోని (Margoli) సెయింట్ ఫిలిప్ నెరి విచారణలో జన్మించారు, మే 13, 1996న అజ్మీర్ మేత్రాసన గురువుగా అభిషేకింపబడ్డారు.

1996-1999 కోటలోని సెయింట్ పాల్స్ చర్చిలో సహాయక విచారణ గురువుగా,

1999-2001 లాడ్‌పురాలోని సెయింట్ థెరిసా చర్చి ఇన్‌చార్జ్ గా,  

2001-2007 అజ్మీర్‌లోని రోమన్ కాథలిక్ మేత్రాసన సామాజిక సేవా సెంటర్ డైరెక్టర్ గా , 

2010-2015 సెయింట్ మార్టిన్ ఆఫ్ టూర్స్ చర్చి ఇన్‌చార్జ్ మరియు సెయింట్ మార్టిన్ స్కూల్, భవానీఖేరా ప్రిన్సిపాల్ గా 

2015-2020 సెయింట్ పాల్స్ విచారణ గురువుగా మరియు సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్, కోట ఉపాధ్యక్షులుగా తన సేవను అందించారు

2013-2018 వరకు మేత్రాసన కన్సల్టర్ గాను ; 2022-2023 వరకు విద్యా విభాగ కార్యదర్శి తన సేవను అందిస్తున్నారు.