లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధితుల కోసం ఫ్రాన్సిస్ పాపు గారు ప్రార్థనలు

లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధితుల కోసం ఫ్రాన్సిస్ పాపు గారు ప్రార్థనలు

లాస్ ఏంజలెస్‌ కార్చిచ్చుల బారిన పడిన వారి కోసం ప్రజలు తనతో కలిసి ప్రార్థన చేయాలని  పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు.  

లాస్ ఏంజిల్స్ అగ్రపీఠాధిపతులు  జోస్ హెచ్. గోమెజ్‌కు పంపిన టెలిగ్రామ్‌లో, ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో చెలరేగుతున్న మంటలతో బాధపడుతున్న వారికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన “ఆధ్యాత్మిక సాన్నిహిత్యాన్ని” తెలియజేసారు.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరానికి సమీపంలో ఇటీవల జరిగిన మంటల వల్ల సంభవించిన "ప్రాణనష్టం" మరియు " విధ్వంసం" పట్ల ఫ్రాన్సిస్ పాపు గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరియు కార్చిచ్చుల బారిన పడిన వారి కోసం ప్రార్థిస్తున్నానని  "మరణించిన వారి ఆత్మలను సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమపూర్వక దయకు" అప్పగిస్తున్నానని అన్నారు .

విద్వాంసం వల్ల బాధపడుతున్న వారికి "హృదయపూర్వక సంతాపాన్ని" తెలియజేస్తున్నారని మరియు సహాయ చర్యలు మరియు అత్యవసర సేవల సిబ్బంది కోసం ప్రార్థనలు చేస్తున్నారని ఈ సందర్భముగా ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో చెలరేగిన మంటలు దాదాపు 12,000 నిర్మాణాలను బూడిద మరియు శిథిలాలుగా మార్చాయి.  11 మంది మరణించారు  మరియు వేలాది మందిని నిరాశ్రయులను చేశాయి.

శాంటా అనా గాలుల నుండి వచ్చిన గాలుల శక్తితో కాలిఫోర్నియా అడవుల్లో ప్రారంభమైన మంటలు లాస్ ఏంజిల్స్ కౌంటీలో ప్రమాదకర రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ మంటల ప్రభావంతో 10 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటకు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో మంటలు వ్యాపించే ప్రమాదం మరింత పెరిగింది. స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉంది.

వాతావరణఓను  అందించే ప్రైవేట్ సంస్థ అక్యూవెదర్ అంచనా ప్రకారం, నష్టం యొక్క ఆర్థిక ప్రభావం సుమారు $135 బిలియన్ల నుండి $150 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.

నివేదిక ప్రకారం ఇప్పటివరకు 16,300 హెక్టార్ల (40,300 ఎకరాలు) భూమి కాలిపోయిందని.12,300 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ప్రకారం మూడు వేర్వేరు ప్రదేశాలలో మంటలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. ఈ కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer