పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
సోమవారం వాటికన్లో బాలల హక్కులపై జరిగిన మొదటి అంతర్జాతీయ సదస్సులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రసంగించారు. యుద్ధం, పేదరికం మరియు వలసలతో బాధపడుతున్న పిల్లలను ఆదుకోవాలని ప్రపంచ నాయకులను అయన కోరారు. "వారిని ప్రేమించండి మరియు వారిని రక్షించండి" అనేది ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తం.
ఈ సందర్భముగా "పిల్లల ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు" అని సదస్సులో పాల్గొన్న ప్రపంచ నాయకులను ఉద్దేశించి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
సంఘర్షణ, పేదరికం, వలసలు, గర్భస్రావం మరియు నిర్లక్ష్యంతో పిల్లలను "విసిరే వేసే సంస్కృతి" కి బాధితులైన పిల్లల రక్షణ కోసం తన ఉద్వేగభరితమైన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. అటువంటి వారి మాట వినవలసిన తక్షణ అవసరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నొక్కి చెప్పారు.
యుద్ధంతో దెబ్బతిన్న మరియు పేద ప్రాంతాలలో పిల్లల దారుణమైన పరిస్థితులపై దృష్టిసారించాలి అని, అలాగే సంపన్న సమాజాలలోని పిల్లలు కూడా మానసిక, ఆరోగ్య, హింస మరియు సామాజిక అణచివేత వంటి దుర్బలత్వాలను ఎదుర్కొంటున్నారని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
ఆశకు ప్రతీకగా ఉండాల్సిన యువత నిరాశ మరియు భవిష్యత్తు పట్ల ఆశావాదం లేకపోవడంతో బతకడానికి పోరాడుతున్నారని ఆయన గమనించారు. ఇది "విచారకరమైనది మరియు ఆందోళనకరమైనది" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
ఆయన ప్రస్తావించిన అత్యంత ఆందోళనకరమైన అంశాలలో " పిల్లలపై యుద్ధం యొక్క వినాశకరమైన ప్రభావం" ఒకటి. ఇటీవలి కాలంలో చాలామంది పిల్లలు విషాదకరంగా బాంబుల వలన చనిపోవడం.. ఇది ఆమోదయోగ్యం కాదు అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు. అలానే వలస వెళ్లే వారిలో ఎక్కువ మంది నిరాశతో కూడిన ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు అని,ఈ ప్రయాణాలలో లెక్కలేనన్ని పిల్లలు మరియు యువ వలసదారులు ప్రాణాలను కోల్పోవడాన్ని ఆయన మళ్ళీ ఖండించారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రసంగంలో ముఖ్యంగా "త్రోసిపుచ్చే సంస్కృతి"ని ఖండించడం జరిగింది. గర్భస్రావం అనే హత్యాకాండ ద్వారా పుట్టబోయే పిల్లల జీవితాన్ని బలి ఇస్తున్నారు," అని ఫ్రాన్సిస్ పాపు గారు బాధపడ్డారు. ఇది "మొత్తం సమాజానికి ఆశ యొక్క మూలాన్ని నరికివేస్తుంది" అని అన్నారు.
చివరిగా వాటికన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సు " పిల్లల కోసం మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి దోహదపడుతుందని, పిల్లలను, వారి హక్కులను మరియు వారి కలలను ప్రపంచ చేరుకునే విధంగా సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer