ఇరాక్ కుర్దిస్థాన్‌కు సంఘీభావం తెలిపిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఇరాకీ కుర్దిస్థాన్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ఎర్బిల్ పట్టణ ప్రాంతంలో ఇటీవల జరిగిన క్షిపణి దాడి బాధితులకు తన సానుభూతిని మరియు సంఘీభావాన్ని తెలియజేశారు.
తన వీక్లీ జనరల్ ఆడియన్స్‌లో, ఆయన పొరుగువారి తో మంచి సంబంధాలు హింస ద్వారా కాకుండా సంభాషణ మరియు సహకారంతో నిర్మించబడతాయని నొక్కి చెప్పారు
"మిడిల్ ఈస్ట్ మరియు ఇతర యుద్ధ దృశ్యాలలో ఉద్రిక్తతను పెంచే దశను నివారించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను" అని ఆయన అన్నారు
పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యుద్ధ బాధితుల కోసం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు
“యుద్ధం ఎల్లప్పుడూ నాశనం చేస్తుంది. యుద్ధం ప్రేమను నాటదు. ఇది ద్వేషాన్ని విత్తుతుంది. యుద్ధం నిజమైన మానవ ఓటమి. యుద్ధంలో అతలాకుతలమైన ప్రజల కోసం ప్రార్థిద్దాం” అని ఆయన విజ్ఞప్తి చేసారు
Article by: S. Pradeep