మహ్మదీయులు, క్రైస్తవులు శాంతి స్థాపకులుగా ఉండాలని పిలుపినిచ్చిన వాటికన్

రంజాన్ మాసం సందర్భంగా వాటికన్ పొప్ పరిపాలన యంత్రాంగంలోని మతాంతర సమాలోచనల విభాగం అధ్యక్షులు కార్డినల్ జార్జ్ జాకబ్ కూవాకాడ్ సంతకం చేసిన సందేశాన్ని వాటికన్ విడుదల చేసింది.
ఈ సంవత్సరం మహ్మదీయుల రంజాన్ మాసం మరియు క్రైస్తవులకు తప్పస్సు కాలం రెండు కలిసి రావటం శుభసూచకమని, ప్రపంచ శాంతికై ప్రార్థన చేయటానికి ఇది మంచి సమయమని కార్డినల్ పేర్కొన్నారు
దేవునికి దగ్గర అవటానికి, మనలోని చెడు గుణాలను శాశ్వతంగా వదిలివేసి ఒక మంచి వ్యక్తిగా మారటానికి ప్రార్థన, ఉపవాసం, దానధర్మాలు సహకరిస్తాయని ఆయన ఆదేశించారు.
అదేవిధంగా ముందస్తుగా ముస్లిం సహోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియపరిచారు.
"ఈ రంజాన్ సమీపిస్తున్న తరుణంలో, మా ప్రార్థనలు, సంఘీభావం, శాంతి కోసం మా ప్రయత్నాలు, మరియు మీతో మా స్నేహం నిరంతరం ఉంటాయి అని అయ్యన అన్నారు