నిత్యజీవానికి సిద్దపడమని పిలుపునిచ్చిన పోప్ లియో

డిసెంబర్ 10 వాటికన్ లో సామాన్యు ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో ప్రసంగించారు.
 
పునరుత్థానం వెలుగులో మరణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, “యేసు క్రీస్తు మన నిరీక్షణ” అనే జూబ్లీ ఇతివృత్తంపై పోప్ మాట్లాడారు 

మానవులుగా, ఈ భూమిపై మన జీవితం ఎదో ఒక రోజు ముగిసిపోతుందని మనకు తెలుసు.

మన ప్రస్తుత సంస్కృతి, మరణానికి భయపడుతుంది మరియు దాని గురించి ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంది, అమరత్వం కోసం వైద్యం మరియు విజ్ఞాన శాస్త్రాన్ని కూడా ఆశ్రయిస్తుంది.

అయితే, మనం విన్నఈ రోజు సువార్త, పునరుత్థానం కోరకు ఎదురుచూడమని మనల్ని ఆహ్వానిస్తుంది.

మరణం నుండి జీవితంలోకి ప్రవేశించి క్రీస్తుప్రభువు ఒక నూతన సృష్టికి మార్గ చూపరి అయ్యారు .

మరణం అంతం కాదని, కానీ ఈ ఇహలోక జీవితం నుండి నిత్యత్వంలోకి ఒక ప్రయాణం అని పోప్ గుర్తు చేసారు 

అందువల్ల, మరణం భయపడవలసిన విషయం కాదు, కానీ దాని కోసం సిద్ధపడవలసిన అవసరం ఉంది 

ఈ సమావేశంలో పాల్గొంటున్న ఆంగ్లం మాట్లాడే యాత్రికులకు మరియు సందర్శకులకు, ముఖ్యంగా ఇంగ్లాండ్, వేల్స్, మాల్టా, ఉగాండా, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, సింగపూర్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన వారికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

మీలో ప్రతి ఒక్కరూ, మరియు మీ కుటుంబాలు, దేవుని కుమారుడు మరియు లోక రక్షకుని రాక కోసం సిద్ధపడటంలో ఆశీర్వాదకరమైన ఆగమన కాలాన్ని చవిచూడాలని  నేను ప్రార్థిస్తున్నాను అని పోప్ ముగించారు 

Tags