ఆంధ్ర & తెలంగాణ ప్రాంతీయ ఉపదేశుల పునరుద్ధరణ సమావేశం - 2023

గుంటూరు మేత్రాసనం, భట్టిప్రోలు, పునీత క్లారెట్ ధ్యానాశ్రమం నందు బెంగుళూరు ప్రావిన్స్ -పునీత క్లారెట్ ధ్యాన బృంధం వారు 26-29 జూలై 2023 నుండి 4-రోజుల పాటు "ఉపదేశుల శిక్షణా కార్యక్రమం” నిర్వహించారు.

లూకా శుభవార్త 10:32 " నీవు వెళ్లి అటులనే చేయుము" అనే నేపథ్యంపై ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఉపదేశులు 'దేవుని వాక్యాన్ని' అర్థం చేసుకోవడానికి మంచి స్పష్టత మరియు విశ్వాసంతో సామాన్యులుగా బోధించడానికి సహాయపడే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది అని సెయింట్ క్లారెట్ ధ్యాన ఆశ్రమం సుపీరియర్ మరియు డైరెక్టర్, గురుశ్రీ మార్టిన్ తప్పెట CMF గారు తెలిపారు.

గురుశ్రీ.సిబి.ఎరవిమంగళం CMF (ప్రిఫెక్ట్ ఆఫ్ అపోస్టోలేట్ & మిషన్స్) గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరంగల్ మేత్రాసన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ కమల్ గారు ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారు.

చివరి రెండు రోజుల సమావేశం స్తుతి ఆరాధనలో గడిపారు. గురుశ్రీ గోన ప్రసాద్, గురుశ్రీ కొమ్మారెడ్డి రవి కుమార్, గురుశ్రీ కరియమ్మకిల్ సంతోష్, గురుశ్రీ గుంటూరు రాజు, గురుశ్రీ మాముద్దు చిన్నన్న మరియు గురుశ్రీ తప్పెట మార్టిన్ గార్లు దివ్యబలిపూజను సమర్పించి, దివ్యసత్ప్రసాద  ఆరాధన జరిపించారు.

ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఉపదేశుల సమావేశం జరగడం ఎంతో ఆనందకరం మరియు భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని పాల్గొన్న వారు అభ్యర్థించారు. ఉపదేశుల  చస్తున్న సేవలకు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి మెమెంటో తో సత్కరించారు.

ఆంధ్ర & తెలంగాణ ప్రాంతాలనుండి సుమారు 58 మంది ఈ పునరుద్ధరణ సమావేశంలో పాల్గొన్నారు.

Tags