స్కిన్ క్యాన్సర్‌కు చెక్.. సబ్బు తయారు చేసిన 14 ఏళ్ల బాలుడు

స్కిన్ క్యాన్సర్‌కు చెక్.. సబ్బు తయారు చేసిన 14 ఏళ్ల బాలుడు

 అమెరికాకు చెందిన 14 ఏళ్ల హేమన్ బెకెలే వైద్య శాస్త్రంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు చేయలేని ఓ అద్భుతాన్ని చేశాడు. స్కిన్ క్యాన్సర్‌తో పోరాడేందుకు ఓ సబ్బును ఆవిష్కరించాడు. 2023 3M యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్‌లో ఈ సబ్బును పరిచయం చేశాడు. 9 మంది వ్యక్తులతో పోటీ పడిన హేమన్ బెకెలే. అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్‌గా విజయం సాధించాడు. అందులో 25 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.31 లక్షల ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు.

ఈ స్కిన్ క్యాన్సర్‌ను జయించేందుకు అవసరం అయిన ఈ సబ్బు ధర కేవలం 10 డాలర్లు అంటే రూ.800 మాత్రమేనని హేమన్ బెకెలే స్పష్టం చేశాడు. ఈ సబ్బు చర్మాన్ని రక్షించే కణాలను తిరిగి పెంపొందిస్తుందని, దీంతోపాటు క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే వారికి తగిన శక్తిని కూడా అందిస్తుందని హేమాన్ తెలిపాడు.తాను ఇథియోపియాలో ఉన్న సమయంలో అక్కడి ప్రజలు రోజూ ఎండకు గురికావడాన్ని చూసి తనకు ఈ ఆలోచన వచ్చిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం చర్మ క్యాన్సర్‌పై తన పరిశోధనను కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.