ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - మార్చి 15

 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - మార్చి 15
1972 లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘాల సంస్థ ప్రాంతీయ సంచాలకుడు అన్వర్‌ ఫజల్‌ గారు మార్చి 15 తేదీనే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పరిగణించాలని తీర్మానించారు . దాంతో 1973 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మార్చి15 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

1962 మార్చి 15 న అప్పటి అమెరికా దేశాధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడి దేశ పౌరుల కోసం ప్రప్రథమంగా వినియోగదారుల హక్కులు ప్రకటించారు.

ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన దాని కంటే తక్కువగా ఉంటే దాని వలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారు చేసిన సంస్థ భరించాల్సి వుంటుంది.

వివిధ ప్రాంతాలలో తయారు అయ్యే వస్తువులు గాని, సేవలు గాని చిట్టచివరకు ఉపయోగించే వారే వినియోగదారులు.వినియోగదారులకు వారు వాడే వస్తువుల నాణ్యత గురించి, వస్తువుల సామర్థ్యం గురించి, వాటి స్వచ్ఛత గురించి, వాటి ధరల గురించి పూర్తి సమాచారాన్ని అందించడం కోసం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం జరుపబడుతున్నది.ఈ దినోత్సవం రోజున వినియోగదారుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు నిర్వహిస్తూ వినియోగదారులకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer