పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు స్టేషనరీ - బ్రదర్ సత్యం

పేద పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు స్టేషనరీ - బ్రదర్ సత్యం
యేసు ప్రభువు వారి ప్రేమను చాటడం అంటే, ఆయన చూపిన ప్రేమ మార్గంలో నడుస్తూ, ఇతరులకు సహాయం చేయడం, వారి అవసరాలు తీర్చడం, మరియు వారిని ప్రేమించడం. ఇది మాటల ద్వారా మాత్రమే కాకుండా, చేతల ద్వారా కూడా చూపించాలి. బ్రదర్ సత్యం గారు ఇలానే ప్రభు యేసుని ప్రేమను చాటుతున్నారు.
ఖమ్మం మేత్రాసనం, పెనుబల్లి విచారణ పరిధిలో ఉంటున్నపేద పిల్లలను, బాల కార్మికులను అక్కున చేర్చుకుని వారికీ సహాయాన్ని అందిస్తున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 35 మంది పిల్లల్లో 17 మంది స్కూల్ కి వెళ్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతునందున వారికీ స్కూల్ బ్యాగులు, నోటుబుక్స్ మరియు పెన్సిల్ బాక్స్‌లను అందించారు.
బ్రదర్ సత్యం గారు మాట్లాడుతూ "యేసు ప్రభువు వారి ప్రేమను చాటుతూ సేవ చేయడం అనేది ఒక గొప్ప అవకాశం, మరియు ఇది మన జీవితాలను మరింత అర్ధవంతం చేస్తుంది" అని అన్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer