ఘనంగా జాతీయ బాలల దినోత్సవం
ఘనంగా జాతీయ బాలల దినోత్సవం
విశాఖ అగ్రపీఠం, విశాఖపట్నం లోని భారత చెరసాల పరిచర్య ( PMI ) వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నంలోని జువెనైల్ హోమ్ (బాల్య నిర్బంధ కేంద్రం)లో ఈ బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమం PMI కో ఆర్డినేటర్ గురుశ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో జరిగింది .
ఈ కార్యక్రమంలో ఎన్నో ఏళ్లుగా నిస్వార్థమైన సేవ చేస్తూ ఖైదీలలో మార్పు కొరకు పాటుపడుతూ, వారికొరకు ప్రార్థిస్తున్నా విశాఖపట్నం PMI(భారత చెరసాల పరిచర్య ) సభ్యులు సిస్టర్ మేరీ జేమ్స్, శ్రీమతి నిర్మల మేరీ పాల్గొన్నారు.
పునీత జోసెఫ్ నర్సింగ్ కాలేజీ స్టూడెంట్స్ పిల్లలలో పశ్చత్తాప భావాన్ని నింపుతూ వివిధ సాంస్కృతిక నాటకాలు,పాటలు,నృత్యాలు వేసారు. దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం కుటుంబ ఆదరణ మరియు సంరక్షణ లేని అనాధపిల్లల హోమ్ ను సందర్శించారు. వారి కొరకు కూడా వివిధ సాంస్కృతిక నాటకాలు,పాటలు,నృత్యాలు వేశారు.
గురుశ్రీ ప్రదీప్ గారు మాట్లాడుతూ "బాలల దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరించారు. దేవునికి పిల్లలు అంటే ఎంత ఇష్టమో తెలియజేసారు. అందరు చిన్ననాటినుండే దేవుని మార్గంలో నడవాలని సూచించారు.
నిర్మల మేరీ గారు మాట్లాడుతూ " అందరు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయాలని కోరారు".
గురుశ్రీ ప్రదీప్ గారు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer