PMI ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

PMI ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

విశాఖ అతిమేత్రాసనం, విశాఖపట్నం లోని లేడీస్  జువెనైల్  హోమ్ లో  సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.  విశాఖపట్టణ మేత్రాసన సమన్వయకర్త గురుశ్రీ ప్రదీప్ గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఈ వేడుకలలో ఎన్నో  ఏళ్లుగా నిస్వార్థమైన సేవ చేస్తూ ఖైదీలలో మార్పు కొరకు పాటుపడుతూ, వారికొరకు ప్రార్థిస్తున్నా విశాఖపట్నం PMI  (భారత చెరసాల పరిచర్య) సభ్యులు పాల్గొన్నారు. పునీత జోసెఫ్ కమ్యూనిటీ కాలేజీ స్టూడెంట్స్ పాలొన్నారు.

పునీత జోసెఫ్  కమ్యూనిటీ  కాలేజీ స్టూడెంట్స్ ప్రభుయేసుని జన్మదిన ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో నింపుతూ వివిధ క్రిస్మస్ పాటలు, నృత్యాలు వేసారు.   

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిస్టర్ మేరీ జేమ్స్, సిస్టర్ జసింతా, సిస్టర్ పెట్రోనిల్లా,  శ్రీమతి నిర్మల మేరీ గారు అక్కడ ఉన్నవారితో మాట్లాడి ప్రభు యేసుని ప్రేమను తెలియజేసి వారిలో ధైర్యాన్ని నింపారు. PMI సినియర్ సభ్యులు శ్రీమతి నిర్మల మేరీ గారు దైవ వాక్యాన్ని చదివి వినిపించారు.   
 
అనంతరం సభ్యులు పిల్లల సంరక్షణ మరియు రక్షణ కేంద్రం లో ఉన్న వారికొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ప్రతి రోజు ప్రార్థనలో గడపాలని కోరారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer