విశాఖ అతిమేత్రాసనం, ఎర్రసామంతవలస గిరిజన విచారణలో సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ స్వస్థత ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది.విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో పిల్లల శిబిరం ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం, ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో జపమాల మాత పండుగ ఘనంగా జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం జరిగింది.
విశాఖపురి మేరిమాత పుణ్యక్షేత్రం, కొండగుడిలో జపమాల రాజ్ఞీ మహోత్సవము భక్తియుతంగా జరిగింది. జపమాల రాజ్ఞీ మహోత్సవము మరియు ఫాతిమామాత దర్శనములకు 107 ఏండ్లు (1917-2024) నిండిన శుభతరుణాన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
విశాఖ అతిమేత్రాసనం, మధురవాడ విచారణలో గల పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ (TOR) గారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది.
భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమ్ అదానీ, ఐదు దశాబ్దాలకు పైగా కార్మెలైట్ మఠకన్యలు(Sisters) నడుపుతున్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిమెంట్ నగర్లోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుత సమయంలో, యుద్ధం యొక్క గాలులు మరియు హింస యొక్క మంటలు మొత్తం ప్రజలను మరియు దేశాలను నాశనం చేస్తూనే ఉన్నాయి" అని, మనమందరం ప్రతి చోటా శాంతి చిగురించాలని ఆకాంక్షిస్తూ, "మానవత్వంతో సేవ చేయాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.