rvate

  • ఫిలిప్పీన్స్ లో మరియతల్లి పై తొలి సదస్సు

    Apr 06, 2024
    మే 1న, ఫిలిప్పీన్స్‌లోని క్యూజోన్ సిటీ, క్లారెట్ స్కూల్‌లో మరియతల్లి పై తొలి సదస్సు జరగనుంది

    "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు" (లూకా 1:42) అనే నేపథ్యంపై ఈ సదస్సు జరగనుంది

    ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

    ఫిలిప్పీన్స్‌లో మరియతల్లిపై ఆధ్యాత్మికతను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు క్లారెషియన్ కమ్యూనికేషన్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుశ్రీ డెన్నిస్ తమయో తెలిపారు.

    "మరియతల్లితో మా ప్రయాణం ముగియలేదు. యుగాలుగా, ఆ తల్లి మాకు తోడుగా ఉంది, మమ్మల్ని దేవునికి దగ్గరగా నడిపించింది" అని గురుశ్రీ తమయో అన్నారు.
  • వాటికన్ సినడ్ సమావేశంలో పాల్గోనున్న ముగ్గురు ఫిలిపినో గురువులు.

    Apr 05, 2024
    ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు వాటికన్‌లో జరిగే ప్రపంచవ్యాప్త విచారణ గురువుల సమావేశంలో పాల్గొనేందుకు ముగ్గురు ఫిలిపినో గురువులు ఎంపికయ్యారు.

    1 .మొన్సిగ్నోర్ జోయెల్ బ్రూనో బారుట్, వికార్ జనరల్-లావోగ్ మేత్రాసనం,
    టీమ్ మినిస్ట్రీ మోడరేటర్, లావోగ్ సిటీలోని సెయింట్ విలియం ది హెర్మిట్ కేథడ్రల్

    2 .మొన్సిగ్నోర్ మార్నిటో బన్సిగ్, ఎపిస్కోపల్ వికార్, మాసిన్ మేత్రాసనం,వికార్ ఫోరేన్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ వికారియేట్,విచారణ గురువులు, బాటో, లేటేలోని హోలీ చైల్డ్ విచారణ
    3 .మొన్సిగ్నోర్ జూలియస్ రోడుల్ఫా,వికార్ జనరల్, ఎపిస్కోపల్ వికార్ మరియు దావో అగ్రపీఠ పాస్టరల్ డైరెక్టర్,దవావో నగరంలోని శాన్ పెడ్రో కేథడ్రల్ విచారణ, పార్శియల్ వికార్ లు ఎన్నికయ్యారని ఫిలిప్పీన్స్‌లోని కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CBCP) సెక్రటరీ-జనరల్
    మొన్సిగ్నోర్ బెర్నార్డో పాంటిన్వా గారు తెలిపారు

    ఫిలిప్పీన్ ప్రతినిధి బృందం కోసం దేశంలోని ప్రధాన దీవుల్లోని లుజోన్, విసయాస్ మరియు మిండనావో నుండి ఒక గురువుని ఎంపిక చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు పాంటిన్ తెలిపారు.

    విచారణ గురువుల సినడ్ సమావేశాలు ఏప్రిల్ 28 నుండి మే 2 వరకు రోమ్ సమీపంలోని సాక్రోఫానోలోని ఫ్రటెర్నా డోమస్‌లో జరుగుతుంది, దాదాపు 300 మంది హాజరయ్యే అవకాశం ఉంది.

    సమావేశం యొక్క చివరి రోజున, పోప్ ఫ్రాన్సిస్ పాల్గొనేవారితో వ్యక్తిగతంగా సమావేశమవుతారు.

    ఈ ప్రపంచవ్యాప్త సమావేశం యొక్క ఫలితాలు ఈ అక్టోబర్‌లో జరిగే సినడల్ అసెంబ్లీ రెండవ సెషన్‌కు సంబంధించిన వర్కింగ్ డాక్యుమెంట్ అయిన ఇన్‌స్ట్రుమెంటమ్ లాబోరిస్‌ను రూపొందించడానికి ఉపయోగించబడతాయి.
  • పవిత్ర గురువారము - కడరా భోజన సంస్మరణ

    Mar 28, 2024
    ప్రేమ ఆజ్ఞ స్థాపన ద్వారా మనం ఒకరికొకరం ప్రేమతో జీవించాలి

    దివ్యసత్ప్రసాద స్థాపన ద్వారా ప్రభవు మనతో వాసం చేస్తారు

    గురుత్వ స్థాపన ద్వారా గురువు దేవునికి- ప్రజలకు వారధిగా సేవలందిస్తారు

    గురువులందరికి పండుగ శుభాకాంక్షలు
  • మ్రానికొమ్మల ఆదివారము |మార్చి 24

    Mar 23, 2024
    * యేసుని యెరూషలేము పుర ప్రవేశం శ్రమల వారానికి నాంధి

    * వినయశీలుడై, శాంతి దూతగా గాడిదపై ఆసీనుడై వచ్చాడు

    * అధికారంతో గాక, ఒక బలహీనుడిగా నగరంలో ప్రవేశించారు.

    * ప్రజలు దారి గుండ తమ వస్త్రములను పరుచుట

    * ఖర్జూరపు మట్టలతో యేసుకు స్వాగతం

    హోసన్నా! ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక!
  • కార్మిక యోసేపు పండుగ

    Apr 30, 2024
    కార్మిక భావనను క్రైస్తవీకరించడానికి 1955 సం॥లో 12వ భక్తినాధ పోపుగారిచే ప్రారంభించబడినది.

    తన జీవిత భాగస్వామి మరియకు, కుమారుడైన క్రీస్తుకు వారి యొక్క అవసరములను సమకూర్చుటలో యోసేపు ఆనందించారు,

    శ్రామికులందరకు యోసేపు గారు ఒక ఉదాహరణగా నిలిచారు
  • మహిళా దినోత్సవ వేడుకలు

    Mar 04, 2024
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫాతిమా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో వరంగల్ మేత్రాసనం ఫాతిమా కథడ్రల్ లోని మహిళలందరికీ మార్చి 3,2024 న  ఉదయం 9.00గంటల నుండి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు 
  • CCBI వికార్ జనరల్ల శిక్షణా కార్యక్రమం- గోవా

    Feb 29, 2024
    ఫిబ్రవరి 27న  గోవాలోని, బెనౌలి- CCBI సెక్రటేరియట్ ఎక్స్‌టెన్షన్, శాంతి సదన్ ఏర్పాటు చేసిన వికార్ జనరల్ల  శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా CCBI అధ్యక్షులు, గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి గారు "సంఘాల మధ్య సమైక్యతను పెంపొందించాలని" కోరారు.