WITNESS 2025 అధికారికంగా ప్రారంభించిన CCBI

జనవరి 29, 2025 ,భువనేశ్వర్‌లో జరుగుతున్న 36వ ప్లీనరీ అసెంబ్లీలో CCBI యువతా విభాగం వారు జాతీయ యువజన సదస్సు WITNESS 2025 అధికారికంగా ప్రారంభించారు

CCBI అధ్యక్షులు కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రా; మహా పూజ్య  ఓస్వాల్డ్ కార్డినల్ గ్రేసియాస్; CCBI సెక్రటరీ జనరల్ మహా పూజ్య అనిల్ కూటో; CCBI డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ  స్టీఫెన్ అలతారా; యువతా విభాగ చైర్మన్ మహా పూజ్య ఇగ్నేషియస్ డిసౌజా; ఏలూరు పీఠాధిపతులు,విశాఖ అగ్రపీఠ అపోస్తొలిక పాలనాధికారి, దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహా పూజ్య జయరావు పోలిమెర; ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ చేతన్; మరియు అసోసియేట్ సెక్రటరీ గురుశ్రీ డొమినిక్ సమక్షంలో ఈ ప్రకటన చేయబడింది.

అక్టోబర్ 1–5, 2025 వరకు కేరళలోని డివైన్ రిట్రీట్ సెంటర్‌లో జరగనున్న WITNESS 2025 భారతదేశం అంతటా ఉన్న యువ కతోలికులను విశ్వాసం, సహవాసం మరియు సామాజిక  పరివర్తన అనుభవం కొరకు ఒకచోట చేర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సమావేశం యువతకు క్రీస్తుతో తమ సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి, సమకాలీన సమస్యలపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడానికి మరియు వారి సమాజాలకు సేవ చేయడానికి మార్గాలను అన్వేషించేందుకు ఒక వేదికను అందిస్తుంది.

యువతకు మార్గనిర్దేశం చేయడం మరియు సాధికారత కల్పించడం, వారు సమాజం మరియు విశ్వాసం రెండింటికీ చురుకైన సహకారులుగా మారేలా చూసుకోవడంలో శ్రీసభ అచంచలమైన నిబద్ధతను ఈ సదస్సు కల్పించనుంది.