FABC సామాజిక సమాచార కార్యనిర్వాహక కార్యదర్శిగా గురుశ్రీ జాన్ మీ షేన్ నియామకం

 Federation of Asian Bishops’ Conferences' (FABC) సామాజిక సమాచార  కార్యనిర్వాహక కార్యదర్శిగా గురుశ్రీ John Mi Shen నియమితులయ్యారని రేడియో వెరితాస్ ఆసియా నివేదించింది.

మార్చి 12న, FABC కేంద్ర కమిటీ గురుశ్రీ జాన్ నియామకాన్ని ఆమోదించింది. డిసెంబర్ 31, 2028 వరకు ఆయన పదవీకాలం కొనసాగుతుందని వెల్లడించారు.

ఆగస్టు 2024 నుండి రేడియో వెరితాస్ ఆసియా ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గురుశ్రీ జాన్ , గురుశ్రీ జార్జ్ ప్లాథోడమ్, SDB స్థానంలో నియమితులయ్యారు,

జనవరి 25, 1980న జన్మించిన John Mi Shen, జూన్ 18, 2010న గురువుగా అభిషేకింపబడ్డారు .

Chinese Diocese of Zhaoxiaన్ నుండి చెందిన గురువు గురుశ్రీ జాన్, 2024లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని Santo Tomas విశ్వవిద్యాలయం నుండి సోషల్ అండ్ పాస్టోరల్ కమ్యూనికేషన్‌ థియాలజీలో డాక్టరేట్ పొందారు.

2010 నుండి 2012 వరకు తన మేత్రాసనంలో పనిచేశారు, 

2012 నుండి 2018 వరకు మనీలాలోని రేడియో వెరితాస్ ఆసియాలో మాండరిన్ విభాగ సమన్వయకర్తగా ఉన్నారు.

అంతేకాకుండా దాదాపు ఒక దశాబ్దం పాటు శాంటో టోమస్ విశ్వవిద్యాలయంలో సామాజిక మరియు పాస్టోరల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ అసోసియేట్ లెక్చరర్‌గా కూడా పనిచేస్తున్నారు.

.