స్వల్పంగా మెరుగుపడ్డ పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి

ఫిబ్రవరి 24 సోమవారం సాయంత్రం, హోలీ సీ ప్రెస్ ఆఫీస్ వారు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం వివరాలను ప్రకటించారు 

ఆస్తమా లాంటి శ్వాసకోశ ఇబ్బంది సంభవించలేదు మరియు కొన్ని ప్రయోగశాల పరీక్షలు మెరుగుదలను చూపించాయి. 

తేలికపాటి మూత్రపిండాల లోపం పర్యవేక్షణ ఎటువంటి ఆందోళనలను కలిగించలేదు. 

ఆక్సిజన్ థెరపీ కొనసాగుతోంది, అయినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు కొద్దిగా తగ్గాయి అని తెలిపారు 

క్లినికల్ పిక్చర్ సంక్లిష్టతను దృష్టిలో ఉంచుకుని, వైద్యులు జాగ్రత్తతో కూడిన రోగ నిరూపణను కొనసాగిస్తున్నారు.

ఉదయం, పోప్ దివ్యసత్ప్రసాదాని స్వీకరించారు, మధ్యాహ్నం, తన పనిని తిరిగి ప్రారంభించారు, సాయంత్రం గాజా గురువులకు సాన్నిహిత్యాన్ని తెలియజేసారు.

గాజాలోని హోలీ ఫ్యామిలీ పారిష్ ఒక వీడియోను పంపిందని మరియు పోప్ వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఫోన్ చేశారని నివేదించబడింది.

తన ఆరోగ్యం కోసం ప్రార్థించడానికి సమావేశమైన దేవుని ప్రజలందరికీ పోప్ ఫ్రాన్సిస్ కృతజ్ఞతలు తెలిపారు.