రోమన్ క్యూరియా మరియు వాటికన్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన పోప్

రోమన్ క్యూరియా అధికారులు, హోలీ సీ, వాటికన్ సిటీ స్టేట్ గవర్నరేట్ మరియు రోమ్ వికారియేట్ ఉద్యోగులతో XIV లియో పోప్ మే 24 శనివారం ఆరవ పాల్ హాల్‌లో సమావేశమయ్యారు.
వారి సేవకు కృతజ్ఞతలు తెలుపుతూ, మిషనరీ స్ఫూర్తితో మరియు ఐక్యతతో సర్వసభకు సేవ చేయడం కొనసాగించమని వారిని ప్రోత్సహించారు.
"రోమన్ క్యూరియాలో పనిచేయడం అంటే అపోస్టోలిక్ సీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి దోహదపడటం" అని ఆయన వివరించారు.
"జ్ఞాపకాలు వర్తమానాన్ని పోషిస్తుంది మరియు భవిష్యత్తును నడిపిస్తుంది."
శ్రీసభ లో సంభాషణను ప్రోత్సహిస్తూ, అవసరాలో ఉన్నవారికి తోడుగా నిలవాలని అయన అన్నారు
సమావేశంలో పాల్గొన్న అందరికీ, ముఖ్యంగా వారి కుటుంబాలు, వృద్ధులు, పిల్లలకు పోప్ తన ఆశీర్వాదాన్ని అందించి ముగించారు