మన భూలోక ప్రయాణంలో నిరీక్షణ చాలా ముఖ్యమైనదన్న పోప్

పాన్-ఆఫ్రికన్ కాథలిక్ థియాలజీ అండ్ పాస్టరల్ నెట్‌వర్క్ (PACTPAN) మూడవ కాంగ్రెస్ సందర్భంగా పోప్ లియో ఆగస్టు 6 న ఒక వీడియో సందేశాన్ని పంపారు
ఆఫ్రికాలో శ్రీసభ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి సమావేశమైన” ప్రతి ఒక్కరికీ తన ప్రార్థనలను మరియు నెట్‌వర్క్ కృషికి కృతజ్ఞతలు తెలిపారు.
రెండవ కాంగ్రెస్ సందర్భంగా విశ్వాస ప్రాముఖ్యత గురించి పోప్ ఫ్రాన్సిస్ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, జూబ్లీ సంవత్సరంలో పోప్ లియో దృష్టిని నిరీక్షణ అనే వేదాంతపరమైన సుగుణము వైపు మళ్లించారు.
నిరీక్షణ ,విశ్వాసం మరియు ప్రేమ అను రెండు సద్గుణాలను కలుపుతుంది.
స్వర్గంలో ఆనందాన్ని కోరుకునేలా మనల్ని నడిపించే ధర్మం నిరీక్షణ, ఇది మనకు కష్టాలు ఎదురైనపుడు దేవునికి దగ్గరగా ఎదగడానికి మనల్ని ప్రేరేపిస్తుంది అని ఆయన అన్నారు
“ఆఫ్రికాలో ఒకే కథోలిక శ్రీసభ కుటుంబంగా నిరీక్షణతో కలిసి ప్రయాణం చేయడం”.ఈ కాంగ్రెస్ ఇతివృత్తం
దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న పిలుపుకు స్పందిస్తూ, మనమందరం ఆ దేవుని బిడ్డలుగా ఐక్యతతో జీవిద్దాము అని పోప్ అన్నారు