మంచి సమరయుడు వలే జీవించమని పిలుపునిచ్చిన పోప్

కాస్టెల్ గాండోల్ఫోలోని సెయింట్ థామస్ ఆఫ్ విల్లానోవా విచారణలో పోప్ లియో జులై 13 న దివ్యబలి పూజను సమర్పించారు.
ఒకసారి మనం క్రీస్తు చేత స్వస్థపరచబడి ప్రేమించబడితే, మనం కూడా ఇతరులకు ఆ ప్రేమ మరియు కరుణకు సాక్షులుగా మారగలగాలి అని పోప్ అన్నారు
ఆదివారం సువిశేష పఠనంలోని ఉపమానం గురించి మాట్లాడుతూ దేవుడు మనల్ని చూసే విధానం గురించి గుర్తుచేస్తూ మనం పరిస్థితులను మరియు ప్రజలను ఎలా చూడాలో ఆ ప్రభువు నుండి నేర్చుకోవచ్చు
"జెరూసలేం నుండి జెరిఖోకు వెళ్తున్న సువార్తలోని వ్యక్తిలాగే, మానవత్వం మరణం లోతుల్లోకి దిగుతోంది" అని పోప్ లియో అన్నారు.
ప్రస్తుత కాలంలో అనేకమంది ఇతరులను పట్టించుకోకుండా స్వార్థంతో జీవిస్తున్నారని మంచి సమరియని వలె పొరుగు వారి గురించి ఆలోచిస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ,వారి బాధలలో పాలుపంచుకోవాలని