భక్తియుతంగా జరిగిన ఆదిలాబాద్ మేత్రాసన రజత జూబిలీ వేడుకలు

రజత జూబిలీ వేడుకలు

భక్తియుతంగా జరిగిన ఆదిలాబాద్ మేత్రాసన రజత జూబిలీ వేడుకలు

ఆదిలాబాద్ మేత్రాసన రజత జూబిలీ వేడుకలు నవంబర్ 9 , 2024 న ఎఫ్రాతా ధ్యానకేంద్రంలో భక్తియుతంగా జరిగాయి 

ముందుగా రేపల్లివాడ విచారణ సభ్యులు కోలాటంతో అతిధులకు స్వాగతం పలికారు.

అదే రోజు తన పీఠాధిపత్య రజత జూబిలీ జరుపుకుంటున్న మహా పూజ్య జోసెఫ్ కున్నత్ గారు మరియు ఆదిలాబాద్ పీఠకాపరి మహా పూజ్య ప్రిన్స్ ఆంటోని గారు ముఖ్య అర్చకులుగా అనేకమంది గురువులతో కలిసి సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు.

విశ్వాసులకు పండుగ సందేశాన్ని ఇచ్చిన మహా పూజ్య ప్రిన్స్ ఆంటోని గారు 25 సంవత్సరాలుగా ఆదిలాబాద్ మేత్రాసనం పై మరియు ఆదిలాబాద్ మేత్రాసన మొదటి పీఠాధిపతి అయిన మహా పూజ్య జోసెఫ్ కున్నత్ గారి పై ఆ దేవాదిదేవుడు కురిపిస్తున్న దయకు ముందుగా ఆయనకు అందరు కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు.

జూబిలీ యొక్క అర్ధం ఏమిటి, మనం జూబిలీ మహోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి అనే విషయాలను మహా పూజ్య ప్రిన్స్ గారు విశ్వాసులకు వివరించారు.

పూజానంతరం విచ్చేసిన పీఠాధిపతులు, అతిధులకు సన్మాన కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

వందలాది మంది మఠవాసులు, విశ్వాసులు ఈ మహోత్సవాలలో పాల్గొన్నారు.