ఫ్రాన్సిస్ పాపు గారి పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేసిన పాపువా న్యూ గినియా పట్టణం
ఫ్రాన్సిస్ పాపు గారి పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేసిన పాపువా న్యూ గినియా పట్టణం
సెప్టెంబరులో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అపోస్టోలిక్ సందర్శన కోసం ఎదురుచూస్తున్న పాపువా న్యూ గినియా (PNG)లోని ఒక పట్టణంలోని కథోలికులు మరియు పౌర సమాజ సభ్యులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని ప్రత్యక్షంగా చూసే అవకాశం పట్ల ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని శ్రీసభకు చెందిన ఒక గురువు చెప్పారు.
అర్జెంటీనా గురువు గురుశ్రీ మిగ్యుల్ డి లా కాల్లే, PNGలోని వానిమోలోని స్థానిక కమ్యూనిటీ ని పూజ్య ఫ్రాన్సిస్ పాపుగారుసందర్శించనున్నారు అని, ఈ ప్రయాణంలో మేము కూడా ఒక భాగం కావడం ఆనందంగా ఉందని ఆగస్ట్ 22న అన్నారు.
ఆగ్నేయాసియాలో తన నాలుగు దేశాల అపోస్టోలిక్ పర్యటనలో భాగంగా మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబరు 8న వానిమోను లోని బారోలోని క్వీన్ ఆఫ్ ప్యారడైజ్ (QOP) ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబర్ 6 నుండి 8 వరకు పాపువా న్యూ గినియాను సందర్శిస్తున్నారు.
"బారోలోని క్వీన్ ఆఫ్ ప్యారడైజ్(QOP ) ఆర్కెస్ట్రా మరియు గాయక బృందంలోని పిల్లలు మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారి సందర్శన సమయంలో వారి మాటలను వ్యక్తిగతంగా వినబోతున్నందున చాలా ఉత్సాహంగా ఉన్నారు" అని గురుశ్రీ కాలే గారు తెలియజేసారు .ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలు 70 మంది ఉన్నారు, వారిలో కొందరు ఫ్లూటిస్టులు, గాయకులు మరియు స్ట్రింగ్ ఆర్కెస్ట్రా ప్లేయర్‌లు.
సెప్టెంబరు 6న మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారి సందర్శనకు ముందు కొవ్వొత్తుల సేవ జరగనున్నది అని నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం సూర్యాస్తమయం సమయంలో జరుగుతుంది మరియు వివిధ ప్రాతాలనుండి అధికసంఖ్యలో వచ్చే విశ్వాసులకొరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్డినల్ మహా పూజ్య జాన్ రిబాట్ గారు మాట్లాడుతూ, ఫ్రాన్సిస్ పాపు గారి ఈ సందర్శన "ప్రజలకు ఆశ, ప్రోత్సాహం మరియు ఆశీర్వాదాలను తెస్తుంది" అని , మరియు కొవ్వొత్తుల సేవ (క్యాండిల్‌లైట్ జాగరణ) కథోలికులకు "ఆశ మరియు విశ్వాసానికి చిహ్నం" అని అన్నారు.
తన పర్యటనలో భాగంగా, పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు న్యూ గినియా చక్రవర్తి ఇంగ్లండ్ రాజు చార్లెస్ III ప్రతినిధిగా వ్యవహరిస్తున్న గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడేని కలవాల్సి ఉంది.
1984 మరియు 1995లో పోప్ జాన్ పాల్ II ఈ దేశాన్ని సందర్శించారు. అతని తర్వాత PNGని సందర్శించిన రెండవ వ్యక్తి మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపు గారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer