పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి నివాళులు అర్పించిన అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి నివాళులు అర్పించిన అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు రోము నగరం లోని కాసా శాంటా మార్టా లోని తన నివాసంలో 21 ఏప్రిల్ 2025 న ఉదయం 7 : 35 గంటలకు కన్నుమూశారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న నేపథ్యంలో ఆయన క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాతి రోజున తన నివాసంలో కన్ను మూసారు.
ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది 21 ఏప్రిల్ 2025 న ఆయనకు నివాళులు అర్పించారు. అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు పాపు గారి ఆత్మ శాంతి కొరకు ప్రార్ధన చేసి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు. అమృతవాణి భవనంలో కార్యాలయాలను నడుపుకుంటున్న పలువురు ఇతర సంఘ విశ్వాసులు కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి నివాళులు అర్పించారు.
Article: B. Arvind Stanley
Design: M. Kranthi Swaroop
(RVA Telugu Online Content Producers)