నైట్ క్లబ్ విషాదంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసిన పొప్ ఫ్రాన్సిస్

కరేబియన్ నగరమైన శాంటో డొమింగోలోని ఒక నైట్ క్లబ్‌లో మంగళవారం ఏప్రిల్ 8 తెల్లవారుజామున మరణించిన దాదాపు 200 మంది ప్రజల కొరకు పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థిస్తున్నారు.
డొమినికన్ రిపబ్లిక్ రాజధానిలోని జెట్ సెట్ నైట్ క్లబ్ పైకప్పు కూలిపోయినప్పుడు 300 మందికి పైగా అందులో ఉన్నారు.
శాంటా డొమింగో అగ్రపీఠాధిపతికి పంపిన టెలిగ్రామ్ లో "మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని మరియు క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆయన ప్రార్థిస్తున్నానని " తెలిపారు
విషాదంలో ఉన్నవారందరికి తన అపోస్టోలిక్ ఆశీర్వాదాన్ని,ఓదార్పును అందిస్తూ, "ప్రతి ఒక్కరూ వారికి సహాయం చేయడానికి మరియు వారికి తోడుగా ఉండటానికి ప్రయత్నించాలని ప్రోత్సహించారు.
అదేవిధంగా పరిస్థితులు అదుపులోకి రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థించాలని, పొప్ ఫ్రాన్సిస్ విశ్వ శ్రీసభను కోరారు.
.