నిజమైన స్నేహం బాధలను కూడా పంచుకుంటుందన్న పోప్ ఫ్రాన్సిస్
పోలాండ్‌లోని ఆంకాలజీ మరియు పీడియాట్రిక్ హెమటాలజీ క్లినిక్ నుండి పిల్లలతో సమావేశమైన పోప్ ఫ్రాన్సిస్, వైద్య సంరక్షణ పొందలేని వారి కోసం ప్రార్థించమని వారిని ప్రోత్సహిస్తున్నారు.
2025 జూబ్లీని "దేవుడు మనకు ప్రత్యేక కృపలను ప్రసాదించాలని కోరుకునే సంవత్సరం" అని
పొప్ ఫ్రాన్సిస్ అభివర్ణించారు.
నిజమైన స్నేహం సంతోషాలను మాత్రమే కాదు బాధలను కూడా పంచుకుంటుందని పొప్ అన్నారు
ముఖ్యంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థించాలని వారిని కోరారు.
ముఖ్యంగా వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న యువ రోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఏసుక్రీస్తు ప్రతి ఒక్కరిలో ఉన్నారని,మన కొరకు అనేక శ్రమలను అనుభవించిన క్రీస్తు శ్రమలతో మన శ్రమలను జతపరిచి ప్రార్థించాలని ఆయన కోరారు.
ముఖ్యంగా ఈ జూబిలి సంవత్సరం మనకు ప్రత్యేక కృపావరాలను ఇవ్వబోతున్న సంవత్సరం అని ఆయన అన్నారు.
ఒక చిన్నారి గీసిన పెయింటింగ్ ను అందుకని, ఆ చిన్నారిని ప్రోత్సహించి ఆశీర్వదించారు.