ఘనంగా మొదలైన జీసస్ యూత్ జాగో
ఘనంగా మొదలైన జీసస్ యూత్ జాగో
బెంగళూరులోని క్రైస్ట్ అకాడమీ లో "JAGO 2025" జీసస్ యూత్ జాతీయ సమావేశం ఘనంగా మొదలైంది.డిసెంబర్ 28–31వరకు ఈ సమావేశం జరగనున్నది. డిసెంబర్ 28న మహా పూజ్య కార్డినల్ ఫిలిపే నేరి ఫెరారో గారు దీనిని అధికారికంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో భారతదేశం అపోస్టోలిక్ నన్షియో మహా పూజ్య లియోపోల్డో గిరెల్లి గారు , మహా పూజ్య పీటర్ మచాడో గారు ,మహా పూజ్య అలెక్స్ వడక్కుంతల గారు , ఇతర పీఠాధిపతులు పాల్గొన్నారు.
అధికసంఖ్యలో గురువులు, కన్యా స్త్రీలు మరియు సుమారు పది వేల మందికి పైగా యువతీ యువకులు "JAGO 2025" సమావేశంలో పాల్గొన్నారు. మహా పూజ్య కార్డినల్ ఫిలిపే నేరి గారు మాట్లాడుతూ ఈ సమావేశం యువతకు ఆశను నింపే ఒక ఉద్యమంగా అభివర్ణించారు. ఆధ్యాత్మికత మరియు ఆనందోత్సాహాల స్మారక వేడుకగా ఈ సమావేశం ఘనం గా జరుగుతుంది.
ఎప్పటిలాగానే "జీసస్ యూత్ " సభ్యులు తమ కుటుంబాలతో సహా పాల్గొని పాల్గొన్నారు. వారి పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దేశవ్యాప్తంగా కతోలిక యువత సమావేశం ఘనంగా జారుతున్నప్పటికీ, తెలుగు ప్రాంతీయ "జీసస్ యూత్" 30 సంవత్సరాల పూర్తి చేసుకున్నప్పటికీ , తెలుగు రాష్ట్రాలలో "జీసస్ యూత్ " కొన్ని మేత్రాసనాలలో, కొన్ని విచారణలలో లేదా కొన్ని నర్సింగ్ కాలేజీ లకు మాత్రమే పరిమితం అయింది. ప్రతి మేత్రాసనాలలో, విచారణలో "జీసస్ యూత్" ను ప్రారంభించి, యువతను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించాలని , జీసస్ యూత్ ద్వారా మన శ్రీసభ యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలని కోరుకుంటూ మీ "అమృతవాణి - రేడియో వెరితాస్ ఆసియ తెలుగు".
Article By M kranthi Swaroop