తైవాన్ యూకారిస్టిక్ కాంగ్రెస్‌కు ప్రత్యేక ప్రతినిధిగా హాంకాంగ్ పీఠాధిపతులు నియామకం
పోప్ ఫ్రాన్సిస్ తైవాన్‌లో జరగనున్న ఐదవ "జాతీయ యూకారిస్టిక్ కాంగ్రెస్‌కు" తన ప్రత్యేక ప్రతినిధిగా హాంకాంగ్ విశ్రాంత పీఠాధిపతులు కార్డినల్ మహా పూజ్య జాన్ టోంగ్ హాన్‌ను నియమించారు.
ఈ ఐదవ "జాతీయ యూకారిస్టిక్ కాంగ్రెస్" ను అక్టోబర్ 5, 2024న కయోస్యుంగ్ మేత్రాసనం వేదికగా నిలువనుంది.
కార్డినల్ హాన్ గారు కాహ్సియుంగ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ముగింపు దివ్యబలిపూజను సమర్పించనున్నారు. వారి వయసు 85 సంవత్సరాలు. వీరు 2012లో 13వ పీఠాధిపతుల సినడ్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ప్రెసిడెంట్ డెలిగేట్గాను మరియు 2014లో జరిగిన 3వ పీఠాధిపతుల సినడ్ మహాసభలో పాల్గొనడంతో విశిష్ట సేవా చరిత్రను కలిగి ఉన్నారు .
ఈ సంవత్సరం యూకారిస్టిక్ కాంగ్రెస్ నేపథ్యం, "ఫ్రెటర్నిటీ హీల్స్ ఆల్", ఇది సెప్టెంబర్ 8 నుండి 15 వరకు ఈక్వెడార్‌లో జరగనున్న 53వ అంతర్జాతీయ యూకారిస్టిక్ కాంగ్రెస్, "ఫ్రెటర్నిటీ హీల్స్ ది వరల్డ్" యొక్క నేపధ్యాన్ని ప్రతిధ్వనిస్తుంది.
తైవాన్ యూకారిస్టిక్ కాంగ్రెస్ దేశం యొక్క మేత్రాసన యూకారిస్ట్ సంవత్సరాన్ని హైలైట్ అవుతుంది, ఇది గత సంవత్సరం ప్రారంభమై నవంబర్‌లో ముగియనుంది..
యూకారిస్టిక్ ఇయర్లో భాగంగా, కాహ్సియుంగ్ నగరంలోని హోలీ రోసరీ కేథడ్రల్‌తో సహా ప్లీనరీలను మంజూరు చేయడానికి నాలుగు పుణ్యక్షేత్రాలు నియమించబడ్డాయి.