తాడిపత్రిలో ఘనంగా క్రీస్తు రాజు మహోత్సవం

 క్రీస్తు రాజు మహోత్సవం

తాడిపత్రిలో ఘనంగా క్రీస్తు రాజు మహోత్సవం

24 నవంబర్ 2024 న కర్నూల్ మేత్రాసనం లోని తాడిపత్రి విచారణలో క్రీస్తు రాజు మహోత్సవం ఘనంగా జరిగింది

కర్నూల్ మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు ఈ మహోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ మహోత్సవం సాయంత్రం 6 గంటలకు దివ్యబలిపూజతో ప్రారంభమయ్యింది.

దివ్యబలిపూజలో క్రీస్తురాజు స్వరూపాన్ని మరియు మరియతల్లి స్వరూపాన్ని పీఠాధిపతులవారు ఆశీర్వదించారు. 

తాడిపత్రి విచారణ కర్తలు గురుశ్రీ డేవిడ్ అరలప్ప గారు, సహాయక గురువులు మరియు విచారణ విశ్వాసులతో కలిసి పీఠాధిపతుల వారిని సాదరంగా ఆహ్వానించారు

క్రీస్తురాజు యొక్క రాజ్యం ప్రేమ, శాంతి, సమాధానాలతో నింపబడిందని, ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా, శాంతి సమాధానాలతో జీవిస్తారని మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు తన సందేశంలో విశ్వాసులకు ప్రభోదించారు.

తాడిపత్రి విచారణను సందర్శించి, క్రీస్తురాజు స్వరూపాన్ని మరియు మరియతల్లి స్వరూపాన్ని ఆశీర్వదించినందుకు, క్రీస్తురాజు మహోత్సవాన్ని తాడిపత్రి విచారణ లో కనియాడినందుకు విచారణకర్తలు పీఠాధిపతులవారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.

అదే రోజు ఉదయం మహా పూజ్య జ్వాన్నెస్ గారు తాడిపత్రి విచారణలో చుక్కలూరు గ్రామాన్ని సందర్శించి, అక్కడి విశ్వాసులను కలిశారు. వారితో కొంత సేపు చర్చించి, విశ్వాసప్రయాణంలో వారికి కావలసిన వాటిని గూర్చి అడిగి తెలుసుకున్నారు.

సాయంత్రం పూజానంతరం పండుగకు సహకరించిన గాయక బృందానికి, నిర్మల మఠకన్యలకు , యువతకు విచారణ గురువులు కృతఙ్ఞతలు తెలిపారు 

Article and Design by: Bandi Arvind