చాపిరేవులలో పునీత అంతోని వారి మహోత్సవము

జూన్ 13 , 2024 న ఉదయం 11 గంటలకు కర్నూలు మేత్రాసనం, నంద్యాల డీనరి,చాపిరేవుల విచారణ పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో పండుగ దివ్యబలిపూజ ఘనంగా జరిగింది.

కర్నూలు  పీఠాధిపతులు మహా.పూజ్య గోరంట్ల జ్వానేస్ గారు పండుగ పూజను సమర్పించి 
శ్రీసభకు పాదువాపురి అంతోని వారు చేసిన సేవలను ఆయన ద్వారా భక్తులు పొందుతున్న మేలులు గూర్చి ప్రసంగించారు 

సుమారు 30 మంది గురువులు, 20 మంది మఠకన్యలు మరియు  4000 మంది అంతోని వారి భక్తులు పాల్గొని దేవుని విశిష్ట దీవెనలను పొందారు.

విచారణ కర్తలు గురుశ్రీ  బాసాని బాల కిషోర్ OFM గారు వచ్చిన పీఠాధిపతులు, గురువులకు  భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు 

ఈ పండుగ పూజలో OFM సభ ప్రొవిన్సియల్ గురుశ్రీ మరియదాస్ గారు పునీత అంతోని వారి భక్తులకోసం ప్రార్ధించారు.
 

Tags