SCALA 13వ సాధారణ సమావేశానికి సందేశాన్ని పంపిన పోప్

Society of Latin American Catechists ( SCALA) 13వ సాధారణ సమావేశం మరియు 10వ అధ్యయనం కోసం పోప్ లియో ఒక సందేశం పంపారు
నజరేతు యేసు వ్యక్తిపై ధ్యానించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యం.
ఆయనను ప్రకటించాలనే కోరిక, 'సువార్త వ్యాప్తిచేయడం' మరియు ఇతరులను ప్రభువు వైపు నడిపించాలనే కోరిక" యేసుపై జ్ఞానం ఆధారంగా వస్తాయి అని పోప్ అన్నారు
1995లో స్థాపించబడిన SCALAలో లాటిన్ అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి పండితులు మరియు పరిశోధకులు ఉన్నారు;
ఈ సంవత్సరం అసెంబ్లీ మరియు అధ్యయన దినాలు జూలై 7-11 వరకు జరుగుతాయి మరియు Brazil, Ecuador, Peru, Bolivia, Chile, Honduras, Uruguay, Venezuela, Costa Rica, Argentina, and Mexico నుండి పండితులు సమావేశమైయ్యారు
వీరు పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించిన సినడల్ మార్గంపై దృష్టి పెడతారు, వేదాంత దృక్పథం నుండి కేటచిస్టులకు మార్గదర్శకత్వం అందించనున్నారు